HomeMovie NewsKannappa First Song got Good Response '​కన్నప్ప' ఫస్ట్ సాంగ్ కి గుడ్ రెస్పాన్స్ 

Kannappa First Song got Good Response ‘​కన్నప్ప’ ఫస్ట్ సాంగ్ కి గుడ్ రెస్పాన్స్ 

- Advertisement -

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ మూవీ కన్నప్ప. ఈ మూవీలో శరత్ కుమార్, మోహన్ లాల్, ముకేశ్ ఋషి, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రభాస్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. 

ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ మూవీ ఏప్రిల్ 25న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. ఇటీవల కన్నప్ప నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్, పాత్రధారుల యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక నిన్న ఈ మూవీ నుండి శివ శివ శంకర అనే పల్లవితో సాగే ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసారు. రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ సాంగ్ ని విజయ్ ప్రకాష్ అద్భుతంగా ఆలపించారు. 

ఆకట్టుకునే లిరిక్స్ తో పాటు ట్యూన్ తో ఈ సాంగ్ ప్రస్తుతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటూ 6 మిలియన్ కి పైగా వ్యూస్ తో కొనసాగుతోంది. త్వరలో మూవీ నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి రిలీజ్ అనంతరం కన్నప్ప ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp

See also  Thandel Ready for Breakeven మొదటి వారంలో బ్రేకీవెన్ కి సిద్దమైన 'తండేల్' 


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories